![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియస్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -92 లో..... ప్రేమ ధీరజ్ లు కళ్యాణ్ ని వెతకడానికి బస్ లో వెళ్తారు. బస్ పడకతో ప్రేమ వాంథింగ్ చేసుకుంటుంది. అక్కడ పక్కనున్న బామ్మా ప్రేమ నాడీ పట్టుకొని చుస్తుంటే ఎందుకు ఆలా చూస్తున్నావని ప్రేమ అడుగగా.. నెల తప్పావేమోనని చూస్తున్నా కానీ ఇది ఆ వంథింగ్ కాదని బామ్మ అంటుంది. మరొకవైపు రామరాజు పేపర్ పట్టుకొని ఇంట్లోకి వస్తాడు. ఎందుకు ఇంత సంతోషం గా ఉన్నారని వేదవతి అడుగుతుంది. ఏం లేదు రేపు స్వయంవరం ఉంది. అక్కడికి అందరు పెళ్లి సంబంధం కోసం వస్తారు. మనం కూడా చందుని తీసుకొని వెళదామని రామరాజు అంటాడు.
చందుకి కావాల్సిన మంచి జోడిని మనం సెలక్ట్ చెయ్యచ్చని రామరాజు అంటాడు. మరొకవైపు భాగ్యం కూతురు వల్లి తనని పెళ్లి చేసుకుంటానంటూ వల్లి వెంట పడుతుంటే.. వల్లి భాగ్యంకి వెళ్లి చెప్పడంతో ఆతన్ని భాగ్యం ఉతికారేస్తుంది. మీరేదో డబ్బున్నోళ్లు అయినట్లు ఎందుకు అంత బిల్డప్.. ఇంత వరకు నీ కూతురుకి పెళ్లి చెయ్యలేదు అంటూ వాడు భాగ్యంతో అంటాడు. అప్పుడే స్వయంవరం అడ్వైటైజ్ మెంట్ వచ్చిన పేపర్ భాగ్యం చూస్తుంది. రేపు ఎలాగైనా ఈ స్వయంవరానికి వెళ్లి అక్కడ గొప్పింటికి కోడలిని చేసి అందరిని నీ గ్రిప్ లో పెట్టుకునేలా అత్తారింట్లో నువ్వు చక్రం తిప్పేలా చేస్తానని భాగ్యం అంటుంది. ఇప్పుడు మనం స్వయంవారానికి వెళ్ళాలా అని వేదవతి ఇబ్బందిగా అడుగుతుంటే.. వెళ్ళాలి కంపుల్సరీ అని రామరాజు చెప్తాడు.
మరోకవైపు భాగ్యం కుటుంబం బట్టల షాప్ కి వెళ్తారు. స్వయంవరానికి వెళ్ళడానికి బట్టలు అద్దెకు తీసుకుంటారు. చందు స్వయంవరానికి వెళ్ళడానికి రెడీ అవుతుంటే.. రామరాజు వచ్చి మాట్లాడతాడు. మరొకవైపు ప్రేమ వాళ్ళు బస్ దిగి కళ్యాణ్ ఉన్న దగ్గరికి వెళ్తుంటారు. తరువాయి భాగంలో చందుని భాగ్యం చూసి బకరా దొరికాడు.. నీకు నచ్చాడా అంటూ శ్రీవల్లితో అంటుంది. చందు కూడా శ్రీవల్లి వంక చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |